మంత్రి అనిల్ పై మరోసారి ధ్వజమెత్తిన.. ఏ వి ఆర్

0
132

*మంత్రి అనిల్ పై మరో మారు ధ్వజమెత్తిన టిడిపి జిల్లా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి*

*పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం కోసం నిర్వహించిన 13 కోట్ల టెండర్లలో 30 శాతం అధికార పార్టీ నేతలు పంచుకున్నారని టిడిపి జిల్లా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అనిల్ ను లక్ష్యంగా చేసుకుని పలు విమర్శలు చేశారు. అక్కచెరువుపాడు లో 5 పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఎన్ని తప్పులు చేస్తున్న ఎందుకు మౌనం వహిస్తున్నారని దీని వెనకాల ఎంత చేతులు మారాయని ఆయన ప్రశ్నించారు. అసైన్డ్ భూముల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేశారని తవ్వకాలు జరిపిన భూములను పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రస్తుతం సేకరిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా మంత్రి అనిల్ కుమార్ తో పాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే పై ఆయన తనదైన శైలిలో విమర్శలు కురిపించారు. తన రాజకీయ జీవితంలో అనిల్ లాంటి అక్రమాల మంత్రి ని చూడలేదని విమర్శించారు. జిల్లాలో జరిగే గ్రావెల్ దోపిడీకి మంత్రి అనిల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కోవూరు నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్ వ్యవహారం పై 14 మందిపై కేసు నమోదు చేశారని వీరిలో ఎక్కువ మంది వైసీపీ నేతలని దీనిని తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. నెక్లెస్ రోడ్డు నిర్మాణం చేసే కాంట్రాక్టర్ తమకు ముడుపులు ఇవ్వలేదన్న కారణంతో అధికార పార్టీ నేతలు పనులు నిలిపివేశారని విమర్శించారు. అక్కచెరువుపాడు లో జరుగుతున్న అవినీతి కుంభకోణానికి సంబంధించి మంత్రి అనిల్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here