బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం

0
55

ఘనంగా మహిళా దినోత్సవం…. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నెల్లూరులోని గీతామయి ఆశ్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవా న్నీ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోర్చా జిల్లా ఉపాద్యక్షురాలు కందకట్ల రాజేశ్వరి మాట్లాడుతూ సృష్టిలో ఒక జీవి కి ప్రాణం పొసే శక్తి మహిళలకు మాత్రమే ఉందనన్నారు. తల్లీగా, భార్యగా, సోదరిగా, కూతురిగా వుండే మహిళల పట్ల నేటి సమాజంలో కొందరు మృగాళ్లు అత్యాచారాలకు పాల్పడడం క్షమించరాని నేరమని తెలిపారు. అనంతరం ప్రధాన కార్యదర్శి పాలడుగు సుభాషిణి మాట్లాడుతూ నేటి సమాజంలో పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణించడం ఆనందంగా ఉందన్నారు. పట్టణ మహిళ అధ్యక్షురాలు కృష్ణమ్మ మాట్లాడుతూ మహిళా సాధికారత మోడీతోనే సాధ్యమని తెలిపారు. అనంతరం మహిళలకు చీరలు పంపినిచేసి, అల్పాహారం అందచేశారు. అనంతరం అడిషనల్ spని సన్మానించారు కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here