నర్సుల సేవలు ఎనలేనివి… జనసేన

0
74

నర్సుల సేవలు ఎనలేనివి….వైద్యరంగంలో నర్సులు చేస్తున్న సేవలు ఎనలేనివని జనసేన పార్టీ నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రెడ్ క్రాస్ లో వైద్యసేవలు అందిస్తున్న నర్సుల పాదాలకు నమస్కరించి వారికి పొష్టికాహారం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో వ్యాధి సోకిన వారికి చికిత్స అందిస్తున్న నర్సుల సేవలను విలువ కట్టలేమన్నారు. పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు నర్సులు చేస్తున్న సేవలకు వారిని గౌరవిస్తూ డ్రై ఫ్రూట్స్ తో పాటు పొష్టికాహారం, పండ్లు అందచేయడం జరిగిందన్నారు. అనంతరం జనసేన యువజన విభాగం అధ్యక్షుడు గుణకుల కిషోర్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ పిలుపు మేరకు మనుక్రాంత్ రెడ్డి సహకారంతో లాక్ డౌన్ నేపథ్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు.నర్సులు దేవతల తో సమానమని తెలిపారు.రెడ్ క్రాస్ DR.యేశ్వర దన్ మాట్లాడుతూ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్మి శెట్టి ఉదయ్ రాయల్.. ప్రశాంత్.శశాంక్. సాయి. బాలాజీ తదితరులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here