దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం జగన్ వాగ్దానాలు అమలు.. ఎంపీ ఆదాల

0
105

దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం జగన్ వాగ్దానాలు అమలు

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి వాగ్దానాలను అమలు చేశారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కితాబునిచ్చారు కొడవలూరు మండలం లోని ఆలూరు పాడు గ్రామానికి చెందిన కుమ్మర కుంట కాలనీలో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తో కలిసి శనివారం ఆర్ఓ ప్లాంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జగన్ అధికారం చేపట్టే నాటికి రాష్ట్రానికి ఆర్థిక భారం ఎక్కువగా ఉందని అయినప్పటికీ ఆరు నెలలోనే వాగ్దానాలను అమలు చేశారని తెలిపారు చంద్రబాబు దీనికి పూర్తిగా వ్యతిరేకమని విమర్శించారు చేనేత కార్మికులకు చెప్పిన విధంగా ఏడాదికి 24 వేల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించి దాన్ని కూడా అమలు చేయడం మొదలు పెట్టారని పేర్కొన్నారు రాష్ట్రంలోనే మూడు ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మూడు చోట్ల రాజధానులను ప్రకటించారని తెలిపారు అయితే చంద్రబాబు ఆయన అనుచర వర్గం దీన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు ఆయన హయాంలో జిల్లాకు ఎటువంటి అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు జగన్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు త్వరలో 1000 కోట్లు కేటాయించనున్నారని పేర్కొన్నారు అందులో భాగంగా కోవూరు నియోజకవర్గానికి 400 కోట్లు రాబోతున్నాయని తెలిపారు ఎమ్మెల్యే ప్రసన్న ఆధ్వర్యంలో నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో లో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోటి రూపాయలు ఇచ్చారని అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ఆలూరు పాడు లో 5 లక్షల రూపాయలతో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి రమేష్ స్థలమిచ్చి సహకరించారని అందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, వీరి చలపతి సుధాకర్ రెడ్డి నరసింహారావు తదితర నాయకులు పాల్గొన్నారు ఈ ఆర్ ఓ ప్లాంట్కు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఐదు లక్షల రూపాయలను తన ఎంపీ నిధుల నుంచి కేటాయించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here