ఘనంగాఅమరవీరుల స్మారక దినోత్సవం

0
42

అమరవీరుల స్మారకదినం

భారతదేశ చరిత్రలో.. 1948 జనవరి 30 ఎంతో విషాదకర దినమని నెహ్రూ యువ కేంద్ర డిస్ట్రిక్ట్ యూత్ కో ఆర్డినేటర్ ఆకుల మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. నెహ్రు యువకేంద్ర , పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నెల్లూరు పప్పులవీధిలోని వై వి ఎం సి ఉన్నత పాఠశాల నందు అమరవీరుల స్మారకదినం ఘనంగా జరిగింది. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి కి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మునిగా ప్రజల హృదయాలలో కొలువైన మహాత్మా గాంధీ జనవరి 30 వ తేదీన కన్నుమూశారు. ఆ రోజు ఆయన దినచర్యను గమనిస్తే ఎన్నో ముఖ్య విషయాలు ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంలో ముఖ్య భూమిక పోషించిన భారత జాతీయ కాంగ్రెస్ అవసరం స్వాతంత్రం సిద్ధించడంతో అయిపోయిందని గాంధీజీ భావించారని ఆయన తెలియజేశారు. స్కూలు ప్రధానోపాధ్యాయుడు ఏ తిరుమల రాజు మాట్లాడుతూ.. జీవితమంతా శాంతిని, అహింసని బోధించి ఆచరించిన గాంధీజీ చివరికి హింసకే బలికావడం ఎంతో బాధాకరం.. ఆయన వర్ధంతి రోజైన జనవరి 30వ తేదీన అమరవీరుల స్మారక దినం దినంగా పాటిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె మురళీ మోహన్ రాజు, గౌరవాధ్యక్షుడు టి వెంకటేశ్వర్లు, స్కూల్ అసిస్టెంట్ కల్పం రమేష్ , ఏ రాజారావు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here