కరోనా తో జాగ్రత్తలు పాటిద్దాం

0
44

కరోనాతో జాగ్రత్తలు పాటిద్దాం

ముందు జాగ్రత్త చర్యలతోనే కరోనా వైరస్ ను అరికట్టగలమని ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ జి. శోభారాణి పేర్కొన్నారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నందు కరోనా వైరస్ పై అవగాహనా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ కు ఇప్పటివరకూ కచ్చితమైన మందు కనిపెట్టలేదు. కరోనా వైరస్ ను ముందుగా 1960వ సంవత్సరంలో కనుగొన్నారు. ఈ వైరస్ను మైక్రోస్కోప్లో పరీక్షించగా కిరీటం ఆకారంలో ఉండటంవలన దీనికి కరోనా అని నామకరణం చేశారని తెలిపారు. ఈ వ్యాధి మొదట చైనా దేశంలోని ఉహాన్ అనే ప్రాంతంలో బయటపడింది. ఈ వైరస్ పాములలో ఉన్న వైరస్ తో కలవడం వలన ఈ 7వ రకం కరోనా వైరస్ ఉద్బవించిందని, ప్రజలు కరోనా వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జి. శ్రీనివాసులు రెడ్డి, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. మురళీమోహన్ రాజు, గౌరవాధ్యక్షుడు టి. వెంకటేశ్వర్లు, డాక్టర్ సుదర్శి, ఎన్. ఎస్. ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వినయకుమార్, ఎస్. గిరీష్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులచేత పరిశుభ్రత పాటించాలని ప్రతిజ్ఞ చేయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here