హైదరాబాద్ హాస్టల్ లోని వారికి ప్రభుత్వం ఊరట కలిగించే చర్య…..

0
68

దేశం మొత్తం లాక్ డౌన్‌లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో హైదరాబాద్‌లో పలు హాస్టల్ ల లోని వారికి ఊరట లభించింది. అమీర్‌పేట, పంజాగుట్ట ప్రాంతాల్లో హాస్టళ్లను ఖాళీ చేయాలని నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో యువతీ యువకులు బుధవారం ఆందోళనకు దిగారు. అమీర్‌పేట, పంజాగుట్టలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న వీరంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఇంటికి వెళ్లిపోవడానికి తమకు అనుమతి ఇవ్వాలంటూ వారంతా పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారు ఎలాంటి ఆటంకం లేకుండా స్వగ్రామలకు వెళ్లేలా పోలీసులు పాసులు మంజూరు చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో చెక్‌పోస్ట్‌ల వద్ద ఎలాంటి ఆటంకం లేకుండా విద్యార్థులు తమ తమ స్వస్థలాలకు వెళ్లేలా పాసులు మంజూరు చేశామని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here