ఉలిక్కిపడ్డ బాలీవుడ్ .. నటి ఫ్యామిలీ మొత్తానికి కరోనా

0
111

కరోనా మహమ్మారి బాలీవుడ్ ను బెదరగొడుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. బాలీవుడ్ కు చెందిన ప్రముఖ సింగర్ కనికా కపూర్ కరోనా బారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. తర్వాత మళ్ళీ అదే బాలీవుడ్ కు చెందిన మరో వెర్సిటైల్ సీనియర్ నటుడు కిరణ్ కుమార్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆతరవాత మరో బాలీవుడ్ నిర్మాతకు కరోనా పాజిటివ్ వచ్చింది. నిర్మాత కరీంమొరానీ తో సహా ఆయన ఇద్దరు కూతుళ్లకు కరోనా సోకింది. తాజాగా ప్రముఖ నటి కుమారి సింగ్‌తో సహా ఆమె కుటుంబం మొత్తానికి వైరస్ సోకిందని తేలింది. దీంతో వెంటనే వారిని ఐసోలేషన్‌కు తరలించారు. తామంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆమె భర్త సుయేష్ రావత్, మామ సత్పాల్ మహారాజ్‌కు వ్యాధి సోకిందని చెప్పారు. త్వరలోనే కోలుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here