కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ ఎస్ సి

0
251

హైదరాబాద్‌ : ఢిల్లీ పోలీస్‌, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్(సీఏపీఎఫ్‌) విభాగాల్లో ఖాళీగా ఉన్న 1564 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎస్ ఎస్ సీ) ప్రకటనను విడుదల చేసింది. మొత్తం 1564 ఖాళీల్లో ఢిల్లీ పోలీసలో 169 ఎస్‌ఐ, సీఏపీఎఫ్లో 1395 ఎస్‌ఐ(జీడీ) పోస్టులున్నాయి. సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ తదితర ప్రత్యేక పోలీసు విభాగాలు సీఏపీఎఫ్‌ పరిధిలోకి వస్తాయి. ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై 2021 జనవరి 1 నాటికి 20 నుంచి 25 ఏండ్ల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 16. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరించరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here