కేంద్ర ప్రభుత్వం వరం కిలో బియ్యం మూడు రూపాయలు గోధుమలు రెండు రూపాయలు

0
69

కరోనా వైరస్ కారణంగా సంక్షోభం, దేశమంతా 21 రోజులు లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు కిలో బియ్యం రూ.3, కిలో గోధుమలు రూ.2 కే అందించాలని నిర్ణయించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు… మూడు నెలల పాటు ఈ సబ్సిడీ ధరలకే బియ్యం, గోధుమలను అందిస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. దినసరి కూలీలు, ఉద్యోగాలు కోల్పోయినవారికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మేలు చేయనుంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో అనేక సంస్థలు ఏప్రిల్ 21 వరకు తెరుచుకునే అవకాశం కనిపించడం లేదు. కావున ఈ చర్యలు కాస్త ప్రజలకు ఊరట గా ఉంటుంది అని కేంద్ర ప్రభుత్వం ఆలోచన గా ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here