స్వామి వివేకానంద బోధనల ద్వారా నేటి యువతలో స్ఫూర్తి నింపాలి.. చేజర్ల

0
29

స్వామి వివేకానంద బోధనల ద్వారా నేటి యువతలో స్ఫూర్తి నింపాలి- చేజర్ల

స్వామి వివేకానంద బోధనలను విష్కృతంగా ప్రచారం చేసి నేటి యువతలో స్ఫూర్తి నింపాల్సిన అవసరం ఉందని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు.స్వామి వివేకానంద 158 వ జయంతి సందర్భంగా కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయములో తెలుగుయువత ఆధ్వర్యంలో జరిగిన స్వామి వివేకానంద జయంతి కార్యక్రమంలో స్వామి వివేకానంద చిత్రపటానికి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు స్వామి వివేకానంద మాటల్లో పరిష్కారం దొరుకుతుందని,ముఖ్యంగా ఆయన బోధనలు విష్కృతం గా ప్రచారము చేసి నేటి యువతలో సామాజిక సృహ తీసుకురావాల్సిన అవసరం ఉందని, ప్రపంచంలోని యువత రోజురోజుకు మన దేశ సంస్కృతి వైపు ఆకర్షితులు అవుతుంటే,మన దేశ యువత మాత్రం పాత్స్యత సంసృతి వైపు మొగ్గుచూపుతున్నారని దేని వలన యువతలో రోజు రోజుకి స్వార్థం పెరుగుతుందని ఈ తరుణంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్వామి వివేకానంద బోధనలపై విష్కృతం గా ప్రచారం చేయడము తో పాటు,కాలేజీలు, విశ్వవిద్యాలయలలో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి విద్యార్థులలో స్ఫూర్తి నింపి,సమాజం పట్ల వారి బాధ్యతను తెలియచేయాలని,భారత దేశ ఖ్యాతిని,మన సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద గారని,యువతకు ఒక మార్గదర్శనం చేసిన మహానియుడని అటువంటి మహనీయునికి ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ వారు ఇచ్చిన స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుయువత నాయకులు మారుబోయిన వెంకటేశ్వర్లు, వీరంశెట్టి మధుసూధన రావు, ఇంటూరు విజయ్, చామంతిపురం గౌతంకుమార్,బాపనపల్లి శివకుమార్,కన్నా మహేష్,కోవూరు శివ,సింగన ప్రవీణ్ కుమార్ రెడ్డి, గంటా చరణ్ తేజ్, షేక్ జావిద్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు , ఏలూరు కృష్ణయ్య, పెనుమల్లి శ్రీహరిరెడ్డి, దారా విజయబాబు, జి నరసింహ, శివుని రమణారెడ్డి, కలికి సత్యనారాయణ రెడ్డి,బుధవరపు శివకుమార్, పంతంగి రామారావు, ఆదిశేషయ్య, మన్నెపల్లి వెంకటేశ్వర్లు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here