రాజధాని మార్పు పై బోగస్ నివేదికలు… చేజర్ల

0
27

రాజధాని మార్పే లక్ష్యంగా జి ఎన్ రావు, బోస్టన్ కమిటీల ఏర్పాటు,దానికి అనుగుంగా బోగస్ నివేదికలు ఇచ్చిన కమిటీలు.
మూడు రాజధానుల నిర్ణయం మంచిదని చెప్పిన కెసిఆర్ తెలంగాణాలో కూడా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలి…చేజర్ల
ముఖ్యమంత్రి వై యెస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిని అమరావతి నుండి మార్చాలనే లక్ష్యంతోనే జి ఎన్ రావు, బోస్టన్ కమిటీలను ఏర్పాటు చేసారని, ఆ కమిటీలు దానికి అనుగుణంగా నే నివేదికలు ఇచ్చాయని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. అమరావతి పరిరక్షణ సమితి పిలుపుమేరకు కోవూరు పట్టణ పరిధిలోని రామారావు పేటలో భోగి మంటలలో జి ఎన్ రావు,బోస్టన్ కమిటీ నివేదికలను తగలబెట్టడము జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి తనను గెలిపించిన ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణా రాష్ట్రం అభివృద్ధికి కృషి చేస్తున్నారని,ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవంను కె సి ఆర్ పాదాల దగ్గర తాకట్టు పెట్టారని,హైదరాబాద్ ను అభివృద్ధి చేసేందుకు అమరావతిని చంపేస్తున్నారని,ఈ ఏడూ నెలల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఏర్పడవలసిన పరిశ్రమలు హైదరాబాద్ కు తరలిపోయాయని,హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుందని,మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల వలన హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నదని ఆ రాష్ర్టా మంత్రి శ్రీ హరీశ్వరరావు ప్రకటించారంటే జగన్మోహన్ రెడ్డి, వలన ఆంద్రప్రదేశ్ ఎంత నష్టపోయిందో అర్ధమవుతుందని,ఇప్పటికయినా రాష్ట్రంలోని ప్రజలందరూ ప్రాంతాల కతీతంగా, పార్టీలకతీతంగా, కులాల,మతాలకు అతీతంగా అందరూ ఏకమై అమరావతి ని రక్షించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుమల్లి శ్రీహరి రెడ్డి, జొన్నదుల రవికుమార్, కలికి సత్యనారాయణ రెడ్డి, మారుబోయిన వెంకటేశ్వర్లు, కె సురేష్, గరికిపాటి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here