మన ఆరోగ్యం.. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం

0
95

🥬 *మన ఆరోగ్యం*

*💁‍♂️రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం*

*🍋విటమిన్ సి ఉన్న ఆహారం రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది*

*🍏ఇవి రోజువారీగా తీసుకునే పదార్థాలు*

〰〰〰〰〰〰〰〰

_*జ్వరం, జబ్బుతో బాధపడుతున్నారా అయితే మీరు మొదట చేయాల్సిన పని ఏంటంటే.. కింద సూచించిన పదార్థాలను కొనుగోలు చేయండి. వీటివల్ల మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది*_
〰〰〰〰〰〰〰〰

*1) ఉసిరి*

దీన్ని ఆమ్లా అని కూడా పిలుస్తారు. ఇందులో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచి.. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. అలాగే ఫ్లూ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా సాయపడుతుంది.

*2) మిరియాలు*

ప్రస్తుతం మిరియాలను చాలా మంది ఆరోగ్యం కోసం కాకుండా గార్నిష్ కోసం వాడుతున్నారు. ఇందులో ఉండే పిపెరిన్ అనే పదార్థంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న హానికర టాక్సిన్లను శుభ్రపరుస్తుంది.

*3) తులసి*

ఇందులోని యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు తగ్గుతాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. శ్వాసకోశ వ్యాధులను సైతం తగ్గించేందుకు తులసి సాయపడుతుంది.

*4) పసుపు*

ఇందులోని కర్కుమిన్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పూతో పాటు గుండె వ్యాధులను నయం చేసేందుకు పసుపు ఉపయోగపడుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. గొంతు నొప్పిని తగ్గిస్తుంది.

*5) నేరేడు*

నేరేడు పండు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు అజీర్తి కాకుండా చేస్తుంది. రక్తపోటు (బీపీ)ని అదుపులో ఉంచడంతో పాటు రక్తంలోని చక్కెర నిల్వలను నియంత్రిస్తుంది. నేరేడు వల్ల జ్వరం, జలుబు, దగ్గు తగ్గుతుంది.

*6) దాల్చిన చెక్క*

ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ డయాబెటిక్ వల్ల రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించేందుకు తోడ్పడుతుంది. అంతేకాకుండా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ వల్ల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు తగ్గుతాయి.

*7) వేప*

వేప వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఇందులోని లక్షణాలు మీకు ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుతాయి.

*8) పుల్లటి పండ్లు*

పుల్లటి పండ్లలో ఉన్న విటమిన్ C వల్ల తెల్ల రక్తకణాల ఉత్పత్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దాదాపు అన్ని రకాల పుల్లటి పండ్లలో విటమిన్ C ఉంటుంది. నారింజ, నిమ్మ.. లాంటి ఎన్నో రకాలు పుల్లటి పండ్లకు ఉదాహరణ.

*చివరగా*

_కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండండి. ఇళ్లలోనే ఉండండి. మాస్కులు, శానిటైజర్లను ఉపయోగించండి. వీటి వల్ల మీరు వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. జాగ్రత్త!_

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here