మన ఆరోగ్యం… మెడిటేషన్ వల్ల ఉపయోగాలు

0
70

🥬 *మన ఆరోగ్యం*

🌼 *మెడిటేషన్ రోజు చేయండి మానసిక ప్రశాంతత లేని వారికి ఒక చక్కని మందు*

🌼 రిలీఫ్ ఇచ్చే’ మైండ్ ఫుల్ మెడిటేషన్‌’

🌼 వయసు పైబడినవారు అధిక సమస్యలతో చాల తక్కువగా నిద్రపోతుంటారు.ఈ సమస్యకి మైండ్ ఫుల్ మెడిటేషన్ ద్వారా చెక్ పెట్టొచ్చంటున్నారు కాలిఫొర్నియాయూనివర్శిటికి చెందిన వైద్యనిపుణులు డేవిడ్.

🌼 సాధారణంగా వయసయిన వారు కాళ్లనొప్పులు,అనేక ఆరోగ్యసమస్యలతో ఒత్తిడికి లోనై భాదపడుతుఉంటారు.అందువలన వీరు నిద్రపోవాలన్న శరీరం సహకరించదు.

🌼 డేవిడ్ యస్ బ్లాక్ అనే శాస్త్రవేత్త నిర్వహించిన సర్వేలో యావరేజ్‌గా 66 సంత్సరాలు కలిగిన 49 మంది ముసలివాళ్లను తీసుకుని….వాళ్లలో 24 మెంబర్స్‌తో మైండ్‌ఫుల్ యోగా చేయించారు.

🌼 అదేవిధంగా మిగిలిన వారితో స్లీప్ హైజిన్ ఎడ్యుకేషన్ చేయించారు.రెండు టీమ్‌ల మధ్య జరిగే డిఫెరెన్సెస్ పరిశీలించి చూస్తే
మైండ్‌ఫుల్ యోగా చేసేవారు ఎక్కువగా రిలీఫ్ పొందటమే కాక ముందు
కంటే హాయిగా నిద్ర పోతున్నారని నిర్ధారించారు.అంతేకాదు ఒత్తిడి,ఆరోగ్యసమస్యలు సైతం ముందుకంటే తక్కువగా ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది.

🌼 మెడిటేషన్ చేస్తున్నారా.. అయితే కడుపు ఖాళీగా ఉంచుకోండి. కడుపు నిండుగా ఉన్నప్పుడు ధ్యానం చేయకూడదు. ఆహారం తీసుకున్న తర్వాత ధ్యానం చేస్తే మగతతో నిద్ర వచ్చేస్తుంది. భోజనం లేదా విందు తర్వాత సుమారు రెండు గంటల విరామం ఇచ్చాకే ధ్యానం చేయాలి.

🌼 అలాగే ధ్యానం చేయాలనుకుంటే తొలుత అనుకూలమైన సమయాన్ని ఎంచుకోవాలి. దీనిని రోజు ప్రారంభ సమయాల్లో చేయటం మంచిది. ఈ సమయంలోనే నిశ్సబ్దం, ప్రశాంతత ఉంటాయి.

🌼 అలాగే రోజులో ఈ సమయంలో తగినంత ఖాళీ లేని వారు అనేక మంది ఉన్నారు. అందువల్ల పనయ్యాక సాయంత్రం లేదా నిద్రించే ముందు మెడిటేషన్ చేయవచ్చు. కానీ ప్రతి రోజు ఒకే సమయంలో చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు నవీన్ నడిమింటి సెలవిస్తున్నారు
యోగా, మెడిటేషన్ చేసే వారికోసం.

🌼 యోగా, మెడిటేషన్ చేసే సమయంలో నిజమైన ప్రకృతి లో, గుడిలో ఉన్న అనుభూతిని పోందాలంటే అందుకు అనువైన చక్కని సంగీతం ఉంటే చాలు మీ దృష్టి పక్కకు వెళ్లకుండా చక్కగా మీకు కావలసినంత సేపు యోగా, మెడిటేషన్ చేసుకోవచ్చు.

🌼 అందుకోసం ఈ app ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.

🌼 ఇందులో సందర్భానికి తగిన చక్కని సంగీతంతోపాటుగా మీకు నచ్చిన విధంగా బ్యాగ్రౌండ్ ఇన్స్ట్రూమెంట్స్ ఎక్కువ తక్కువ చేసుకుని మీకు ఎంత సమయం కావాలో అంత టైమ్ సెట్ చేసుకోవచ్చు.

🌼 *సభ్యులకు విజ్ఞప్తి*
******************

👉 ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here