మన ఆరోగ్యం.. పెరుగుతో ఉపయోగాలు..

0
103

🥬 *మన ఆరోగ్యం*

💦 *పెరుగును ఈ 10 పదార్థాలతో విడిగా కలిపి తినండి, అద్బుత ఫలితాలు పొందండి.
💦 కొద్దిగా జీలకర్రను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు. 
💦 కొద్దిగా నల్ల ఉప్పును పొడి చేయాలి. దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపు కుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. ప్రధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి తగ్గుతాయి. 
💦 కొద్దిగా పెరుగులో మిశ్రి కలుపుకుని తినాలి.
దీంతో శరీరానికి వెంటనే శక్తిఅందు తుంది. మూత్రాశయ సంబంధ సమస్యలు పోతాయి. 
💦 కొంత వాము,నల్లుప్పు తీసుకుని
ఓ కప్పు పెరుగులో కలిపి తినాలి. దీని వల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇతర దంత సంబంధ సమస్యలు పోతాయి. 
💦 ఓ కప్పు పెరుగులో కొంత జీలకర్ర పొడి, మిరియాల పొడినికలిపి తినాలి. దీని వల్ల మలబద్దకం దూరమవుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
💦 *రోజూ ఉదయం ”కాఫీ, టీ”ల కంటే ఒక గ్లాసు మజ్జిగ తాగితే శరీరంలో అద్భుత మార్పులు*
💦 సాధారంగా చాలా మందికి నిద్రలేవగానే కాఫీలు, టీలు తాగే అలవాటు ఉంటుంది.
💦 అయితే ఇండియాలో కొన్ని ప్రదేశాల్లో మాత్రం ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు మజ్జిగ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది.
💦 ముఖ్యంగా వేసవి సీజన్ లో వేడిని తట్టుకోవడానికి మజ్జిగ ఎక్కువ తాగుతారు.
మజ్జిగను పెరుగు, కొన్ని మసాల పోపు దినుసులతో రుచికరంగా తయారుచేసుకుంటారు.
💦 కరీవేపాకు, ఆవాలు, అల్లం, జీలకర్ర వంటి పోపులతో బట్టర్ మిల్క్ తయారుచేసి తీసుకుంటారు.
💦 పెరుగులో ప్రోబయోటిక్ వంటి మంచి ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. మజ్జిగ జీర్ణక్రియను పెంచుతుంది,
💦 క్యాలరీలను తగ్గిస్తుంది. ముఖ్యంగా మలబద్దకంతో బాదపడే వారు ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు మజ్జిగను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
💦 రోజూ ఉదయం పరగడపున మజ్జిగ తాగడం వల్ల పొందే మరికొన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
💦 రోజూ ఉదయం మజ్జిగ తాగడం వల్ల పొట్ట చల్లగా ఉంచి, కడుపులో మంట తగ్గిస్తుంది. అలాగే అసిడిక్ రిఫ్లెక్షన్ వల్ల పొట్టలో చీకాకును తొలగిస్తుంది.
💦 బట్టర్ మిల్క్ తాగినప్పుడు, కడుపులో ప్రశాంతంగా, చల్లగా ఉంటుంది. అందుకు కారణం పొట్ట అసౌకర్యానికి గురిచేసే వ్యర్థాలను బయటకు నెట్టవేయడం వల్ల పొట్ట చల్లగా ఉంటుంది
💦 ఇంకా, మజ్జిగా కరివేపాకు, జీలకర్ర, పెప్పర్ పౌడర్ వంటి పదార్థాలను చేర్చడం వల్ల అనేక ఔషధ గుణాలను పొందవచ్చు.
💦 కొద్దిగా హెవీగా భోజనం చేసినప్పుడు పొట్టలో అసౌకర్యంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు అల్లం పౌడర్ కలిపిన మజ్జిగ తాగండి. ఇది జీర్ణశక్తినిన పెంచి వెంటనే కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. అసౌకర్యాన్ని పోగొడుతుంది.
💦 డీహైడ్రేషన్ తో బాధపడే వారికి ఇది ఒక మంచి రెమెడీ, ఒక గ్లాసు మజ్జిగలో కొన్ని మసాలా దినుసులు, ఉప్పు కలిపి తీసుకోవాలి. వేడి వాతావరణంలో మీరు సౌకర్యంగా ఫీల్ అవుతారు.
💦 మజ్జిగలో పొటాషియం, క్యాల్షియం, , విటమిన్ బి కాంప్లెక్స్, వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి.
💦 డయోరియాతో బాధపడేవారు మజ్జిగలో అరటీస్పూన్ డ్రైజింజర్ పౌడర్ కలిపి తీసుకోవాలి. రోజులో 3సార్లు తీసుకుంటే డయోరియా సమస్య నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
💦 ఒక గ్లాసు మజ్జిగను తీసుకవోడం వల్ల కొలెస్ట్రాల్ వెల్స్ కంట్రోల్ అవుతాయి. మజ్జిగలో ఉండేబయో యాక్టివ్ ప్రోటీన్ యాంటీ క్యాన్సర్, యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటుంది.
💦 ప్రతిరోజూ మజ్జిగను తాగడం వల్ల రక్తపోటు (బ్లడ్ ప్రెజర్) ను తగ్గించుకోవచ్చు

💦💦💦💦💦💦💦💦💦💦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here