మన ఆరోగ్యం.. జాగింగ్ వల్ల ఉపయోగాలు

0
81

🚩 *మన ఆరోగ్యం*

🏃‍♀ *జాగింగ్ ప్రయోజనాలు* 🏃‍♀

🚩 ప్రతి రోజూ ఉదయం జాగింగ్ చేయడం చాలా మందికి అలవాటు. శరీరం ఒత్తిడికి గురి కాకుండా, ఈ వ్యాయమం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
🚩 జాగింగ్చేయడంచాలా సులభం. సింపుల్ కూడా. జాగింగ్ చేయడానికి జిమ్ లో లాగా కష్టపడాల్సిన అవసరం లేదు.జాగింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.
🚩 అదే విధంగా బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా మెరుగుపడుతాయి. కొన్ని పరిశోధనల ప్రకారం రెగ్యులర్ గా జాగింగ్ చేసే వారిలో దీర్ఘాయుష్యు పెరుగుతుందని కనుగొన్నారు.
🚩 మీరు కూడా శరీరకంగా ఫిట్ గా మరియు క్యాలరీలను కరిగించుకుని బాడీ ఫ్రెష్ గా కనబడాలంటే జాగింగ్ సహాయపడుతుంది .
🚩 కాబట్టి మీరు కూడా జాగింగ్ను ట్రై చేయండి. ట్రై చేయడానికి ముందు జాగింగ్ చేయడం వల్ల ఏరకమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారో తెలుసుకోండి..
🚩 1. గుండె ఆరోగ్యంగా ఉంటుందిరెగ్యుల జాగింగ్ గ్రేట్ కార్డియో వర్కౌట్. ఇది హార్ట్ మజిల్స్ ను బలోపేతం చేస్తుంది. గుండె మరింత మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.
🚩 జాగింగ్ బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ గ్లూకోజ్ , కొలెస్ట్రాల్ వెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. జాగింగ్ వల్ల రక్తం వేగంగా గుండెకు ప్రసరించేలా చేసి, గుండె సంబంధి సమస్యలను, వ్యాధులను దూరం చేస్తుంది.
🚩 2. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందిజాగింగ్ చేసే సమయంలో శరీరం నుండి ఎండోర్ఫిన్స్ అనే హార్మోన్స్ విడుదల అవుతాయి. ఈ గ్రూప్ హార్మోన్లు మానసిక ప్రశాంతకు సహాయపడుతాయి. ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ న్యాచురల్ గా స్ట్రెస్, టెన్షన్ ను తగ్గిస్తాయి. ఈ ఒక్క కారణం వల్ల శరీరం రిఫ్రెష్ గా ఉంటుంది..
🚩 3. ఎముకల ఆరోగ్యంజాగింగ్ చేసే సమయంలో ఎముకలు కొంత అనుభవాన్ని కలిగి ఉండటం వల్ల ఒత్తిడి తగ్గిస్తుంది, రోజు రోజుకు కావల్సిన బోన్ టిష్యలను తయారుచేస్తుంది. జాగింగ్ వల్ల ఎముకల స్ట్రాంగ్ గా మారుతాయి. ఇది ఎముకలకు సంబంధించిన గాయాలను మాన్పి స్ట్రాంగ్ గా మార్చుతాయి.
🚩 4. కండరాలు వ్రుద్ది చెందుతాయిజాగింగ్ వల్ల శరీరం ఉత్సాహంగా, కదలికలు కలిగి ఉండటం వల్ల కండరాలు వ్రుద్ది చెందుతాయి. ఇది హామ్ ట్రింగ్స్, గ్లూటిల్ మజిల్స్, కాఫ్ మజిల్స్ మొదలగు వాటిని టార్గెట్ చేస్తుంది . జాగింగ్ వల్ల కండరాలు కరగడం వల్ల బాడీ షేప్ మారి చూడటానికి అందంగా మారుతారు.
🚩 5. బరువు తగ్గడానికి సహాయపడుతుందిజాగింగ్ వల్ల శరీరంలో ఎక్స్ ట్రా క్యాలరీలు తగ్గుతాయి. అయితే కేవలం జాగింగ్ వల్ల ఎఫెక్టివ్ నెస్ ఉండదు కాబట్టి, జాగింగ్ తో పాటు డైట్ లో కూడా తప్పనిసరిగా మార్పు చేసుకోవాలి. అప్పుడే వేగంగా బరువు తగ్గుతారు. ఏరోబిక్ ఎక్సర్ సైజ్ వల్ల శరీరంలోని జీవక్రియలు వేగంగా పనిచేస్తాయి.దాంతో ఫ్యాట్ కరగడం సులభం అవుతుంది.
🚩 6. రెస్పిరేటరీ సిస్టమ్ కు ఉపయోగకరంజాగింగ్ వల్ల శ్వాసవ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుతుంది ఎక్కువ ఆక్సిజన్ ను గ్రహించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందుకు రెస్పిరేటరీ మజిల్స్ సహాయపడుతాయి. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే కనుక జాగింగ్ మంచి మార్గం.
🚩 7. వ్యాధినిరోధక శక్తి స్ట్రాంగ్ ఉంటుందివ్యాధినిరోధకశక్తి స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే మీ శరీరంలో వ్యాధులతో , ఇన్ఫెక్షన్స్ తో పోరాడే శక్తి అధికంగా ఉంటుంది. జాగింగ్ శారీరక శక్తిని పెంచుతుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. దాంతో స్ట్రెస్ , డిప్రెషన్, అలసట తగ్గుతాయి.
🚩 8. ఓస్టిరియోఫోసిస్జాగింగ్ వల్ల ఎముకల యొక్క మందాన్ని , ఎముకల పెరుగుదలను మెరుగుపరుస్తుంది. ఇది బోన్ స్ట్రెంగ్త్ ను మెరుగుపరుస్తుంది. వెన్నెముక, తొడల భాగంను స్ట్రాంగ్ గా మార్చుతుంది. ఓస్టిరియోఫోసిస్ తో బాధపడే వారు జాగింగ్ కు ప్రత్యామ్నాయంగా బ్రిస్క్ వాక్ చేయడం మంచిది.
🚩 9. ఆలోచన శక్తిని మెరుగుపరుస్తుందిమీరు కనుక కష్టపరిస్థితిలో, ఆందోళనలో ఉన్నప్పుడు జాగింగ్ తప్పకుండా సహాయపడుతుంది. మీ ఆలోచన శక్తిని మెరుగుపరుస్తుంది. అందుకు ఇది ఒక మంచి మార్గం. జాగింగ్ చేసే సమయంలో మీకు ఏది ముఖ్యమో తెలుస్తుంది, మరియు దానికి మంచి మార్గాన్ని కనుగొంటారు.
🚩 10. యాంటీ ఏజింగ్జాగింగ్ మానసిక, శారీర ఆరోగ్యాలన్నింటికి చాలా మేలు చేస్తుంది. జాగింగ్ వల్ల శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది . పాజిటివ్ శక్తి వస్తుంది. యవ్వనంగా కనబడుతారు. జాగింగ్ చేయడం వల్ల శరీరంలో, చర్మానికి రక్తప్రసరణతో పాటు, ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి. దాంతో నిత్యం యవ్వనంగా కనబడుతారు.

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here