మన ఆరోగ్యం.. అసిడిటీ కి చిట్కాలు

0
80

🥬 *మన ఆరోగ్యం*

🥜 *ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో వుంటే ఏమవుతుంది?*
🥜 ఎక్కువసేపు ఖాళీ కడుపుతో వున్నవారిలో కూడా ఎసిడిటీ సమస్య వస్తుంది.
🥜 ఈ ఎసిడిటీ తలెత్తడానికి కారణాలు ఇదే కాకుండా చాలానే వున్నాయి.
🥜 ఎసిడిటీతో బాధపడే వారికి అరటిపండు అత్యుత్తమమైన ఔషధం. ప్రతిరోజు అరటిపండును ఆహారంగా తీసుకుంటుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది.
🥜 యాపిల్ పండుతో తయారు చేసిన జ్యూసు, వెనిగర్, తేనెను తగినంత నీటిలో కలుపుకోండి.
🥜 ఈ మిశ్రమాన్ని భోజనానికి ముందు సేవించి ఆ తర్వాత భోజనం తీసుకుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.
🥜 1. తీసుకునే ఆహారంలో వీలైనంత మేరకు వేపుడు పదార్థాలను తగ్గించండి. దీంతోపాటు ఊరగాయ, మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం, చాకొలేట్లను తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి.
🥜 2. పచ్చి కూరగాయలతో తయారుచేసిన సలాడ్‌ను తగు మోతాదులో తీసుకోండి. ఉదాహరణకు… ఉల్లిపాయలు, క్యాబేజీ, ముల్లంగి, వెల్లుల్లి మొదలైనవి.
🥜 3. తీసుకునే ఆహారంలో భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండకండి. దీంతో ఉదరంలో గ్యాస్ పేరుకుపోయే ప్రమాదం ఉంది. 
🥜 4. ప్రతి రోజు ఎనిమిది గ్లాసుల నీటిని సేవిచేందుకు ప్రయత్నించండి. 
🥜 5. అసిడిటీతో బాధపడే వారికి తులసి దివ్యమైన ఔషధం. తులసి ఆకులను నిత్యం చప్పరిస్తుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. 
🥜 6. నిత్యం బెల్లం చప్పరిస్తుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. దీనిని ప్రతి రోజు నాలుగు నుంచి ఐదుసార్లు తీసుకుంటుండాలి. 
🥜 7. ఎసిడిటీతో బాధపడుతుంటే బాదం పప్పులను సేవించండి.
🥜 8. కొబ్బరి నీళ్ళను రోజుకు మూడు-నాలుగు సార్లు సేవించాలి.
🥜 9. భోజనానంతరం పుదీనా రసం సేవిస్తే అసిడిటీ నుంచి ఉపశమనం కలిగి మంచి ఫలితాన్నిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

🥜🥜🥜🥜🥜🥜🥜🥜🥜🥜

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here