ఆరోగ్య చిట్కాలు.. పేగు పూత లక్షణాలు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

0
121

🌻 *మన ఆరోగ్యం*
🍂 *పేగుపూత లక్షణాలు – తీసుకోవాలిసిన జాగ్రత్తలు – ఔషదాలు .*
🍂 పేగుపూత అనేది పేగులలో ఉండే పల్చటిపొర పొక్కడం వలన వస్తుంది. ఇంగ్లీషులో “పెప్టిక్ అల్సర్ ” అని కూడా అంటారు. పేగులో పుళ్ళు పడటం వలన ఈ వ్యాధి సంభవిస్తుంది.
🍂 ఈ వ్యాధి రాకుండా చూసుకోవడం ముఖ్యం . వ్యాధి వచ్చాక మందులు వాడటం , ఆపరేషన్ చేయిచుకోవడం వంటి వాటికంటే కనీస జాగ్రత్తలు రాకుండా చూసుకోవటం ముఖ్యం. ఇది ఒక్కసారి వచ్చింది అంటే మళ్లీమళ్లీ వస్తుంది.
🍂ఈ వ్యాధి రావడానికి గల కారణాలు –
🍂 పొగ తాగడం ఈ అల్సర్లు ఏర్పడటానికి
ముఖ్యకారణం . పొగ తాగేవారి ప్రక్కన ఉన్నాకూడా పొగ పీల్చడం వలన కూడా వస్తుంది.
🍂 మానసిక ఆందోళనలు కూడా ముఖ్యకారణం .
🍂 కీళ్లనొప్పులు , తలనొప్పులకు మీరు ఉపయోగించే పెయిన్ కిల్లర్స్ కడుపులో ఆమ్లము లు అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేసి పేగుల్లో పుండ్లు పడటానికి కారణం అవుతున్నాయి.
🍂 ఉబ్బసం , జలుబు , చర్మవ్యాధులు ఉన్నవారు స్టెరాయిడ్ మందులు ఎక్కువ వాడతారు. ఆ స్టెరాయిడ్స్ వలన కూడా పేగుపూత ఎక్కువ వస్తుంది.
🍂 O బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులకు పేగుపూత తొందరగా వస్తుంది. ఈ బ్లడ్ గ్రూపు ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది .
🍂 హైపర్ పారా థైరాయిడ్ ఉన్నవారిలో పేగుపూత , గ్యాస్ ట్రబుల్ తప్పకుండా ఉంటాయి.
🍂 అతిగా ప్రయాణం చేయడం , దుఃఖం , దిగులు , అతిగా మాట్లాడటం , అతిగా సెక్సులో పాల్గొనటం , నెయ్యి లేకుండా అన్నం తినడం , నిలువ ఆహార పదార్ధాలు తినటం , ఎండిన కూరగాయలు తినటం , ఎక్కువుగా కారం , ఎక్కువ పులుపు ,చేదు వస్తువులు తినటం , రాత్రి జాగారం చేయడం ,భోజనం చేయగానే కొద్దిసేపు అయినా విశ్రాంతి లేకుండా సైకిలు తొక్కడం , పరిగెత్తడం , వేగంగా నడవడం , బరువులు మోయడం వంటి కారణాలు పేగుపూత రావడానికి ప్రధాన కారణాలు .
🌻 *లక్షణాలు* –
🍂 కడుపులో నొప్పి మరియు కడుపులో మంటతో కూడిన నొప్పి రావటం .
🍂 జీర్ణాశయం లో ఏర్పడినప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు . పేగుల్లో వస్తుంటే పెప్టిక్ అల్సర్ అంటారు.
🍂 గాస్ట్రిక్ అల్సర్ అనేది ఏర్పడినపుడు రెండు రొమ్ముల మధ్యభాగంలో క్రింద నొప్పి వస్తుంది. మధ్యాన్నం చేసిన భోజనం అరిగే సమయంలో అంటే సాయంత్రం అయ్యేసరికి కడుపునొప్పి మొదలవుతుంది. రాత్రిపూట కంటే పగలు కడుపునొప్పి ఎక్కువ అవుతుంది.
🍂 పేగులో డుయోడినల్ బాగంలో వచ్చే అల్సర్ వల్ల కడుపునొప్పి పైభాగాన వస్తుంది. వెన్నులో తంతున్నట్టు ఉంటుంది. నొప్పి వచ్చినప్పుడు కొద్దిగా మజ్జిగ అన్నం గాని గ్లూకోస్ బిస్కెట్స్ గాని రెండు మూడు అరటిపళ్ళు తింటే తగ్గినట్టు అనిపిస్తుంది.
🍂 ఈ డుయోడినల్ అనే బాగం జీర్ణాశయం నుంచి ప్రేగులు మొదలు అయ్యేచోట జీర్ణాశయంకి పేగులకి మధ్య సంధిగా ఉంటుంది. ఇందులో పుండు పడినప్పుడు ఆ విధమైన కడుపునొప్పి ఉంటుంది. వాంతులు అవ్వడం , రక్తం పడటం అనేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి.
🍂 గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నప్పుడు కూడా ఇటువంటి నొప్పి రావొచ్చు. వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకొని ఔషదాలు త్వరగా తీసుకుంటే వ్యాధి నుంచి తొందరగా బయటపడవచ్చు.

🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here