తెరుచుకోనున్న తిరుమల?????

0
136

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్రప్రభుత్వం విధించిన నాలుగో దశ లాక్ డౌన్ నేటితో ముగియనుంది. దీంతో కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో మరిన్ని సడలింపులు ఇచ్చింది. దీంతో జూన్ 8న తిరుమల తిరుపతి దేవస్థానం తెరచుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇప్పటికే అధికారులు భక్తులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లను జిగ్ జాగ్ చేశారు. అలిపిరి, కాలినడక మార్గాల్లో భక్తులకు వైద్య పరీక్షలు చేసిన తరువాతనే కొండపైకి అనుమతించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే దర్శనాలను ప్రారంభిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులకు ఆన్ లైన్ తో పాటు కరెంట్ బుకింగ్ కౌంటర్ల ద్వారా టైమ్ స్లాట్ టోకెన్లు ఇస్తామని, దర్శనం ఉన్న భక్తులకు మాత్రమే తిరుమలలోకి ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here