జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం… మహిళ మృతి

0
178

చిల్లకూరు, నవంబర్‌ 15 : నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం భూదనం సమీపంలోని తిరుమల పాలడైరీ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ఘటనలో మహిళ మృతి చెందింది. నెల్లూరు నుండి నాయుడు పేటకు బైక్ పై వదిన, మరిది వెళ్తుండగా ముందు వెళ్తున్న లారీ బ్రేక్ వేయడంతో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వెనక కూర్చో ఉన్న వదిన కోవూరు వంశీప్రియ రోడ్డుపై పడడంతో వెనక వస్తున్న మరో లారీ ఆమె పైనుండి వెళ్లడంతో అక్కడికి అక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న మురళీకి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృత దేహాన్ని శవపంచనామా నిమిత్తం గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here