తెలుగు గంగ నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే కిలివేటి

0
164

సూళ్లూరుపేట, నవంబర్ 14,(రవికిరణాలు) : సూళ్లూరుపేట మండలం పరిధిలోని తెలుగు గంగా కెనాల్ 105, ఓటి ద్వారా 10 పంచాయతీలకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని సూళ్లూరుపేట శాసనసభ్యులు తిరుపతి పార్లమెంట్ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు మరియు రాష్ట్ర ప్రజా పద్దుల కమిటీ మెంబర్ కిలివేటి సంజీవయ్య సంజీవయ్య మాట్లాడుతూ మంగా నెల్లూరు, దామా నెల్లూరు, మతకాముడి, వెలగల పొన్నూరు, సుగ్గుపల్లి, మంగళంపూడి, ఉచ్చూరు, ఇలుపూరు దొరవారిసత్రం మండలం పరిధిలోని బూదూరు, తనియాలి గ్రామాలకు మూడు వేల హెక్టార్ల పరిధిలో నీళ్ళు విడుదల చేశామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి కళ్లత్తూరు రాంమోహన్ రెడ్డి, దామా నెల్లూరు సింగిల్ విండో అధ్యక్షులు కళ్లత్తూరు జనార్ధన్ రెడ్డి, ఈఈ సుబ్రహ్మణ్యం, డీ ఈ రాఘవులు రెడ్డి, ఏఈ ఖాశీం, వైయస్సార్సీపి సూళ్లూరుపేట మండల యువజన విభాగం అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దామతోటి లక్ష్మయ్య, సులూరుపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ బూత్ కమిటీ ఇన్చార్జి దేవేందర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి జయరామయ్య, సీనియర్ నాయకులు బూదూరు ప్రభాకర్ రెడ్డి, మీరా రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here