ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి – ఎమ్మెల్యే కాకాణి

0
117

పొదలకూరు, సెప్టెంబర్‌ 30, : పొదలకూరు మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమములో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.ప్రజలనుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో సమస్యలు పరిష్కరించబడుతున్నాయన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడటంతో, విశేషంగా పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకుంటున్నారు.చాలా సంవత్సరాల నుండి పరిష్కారం కాని సమస్యలను కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం.వై.యస్. జగన్ మోహన్ రెడ్డి రైతులకు రైతు భరోసా పధకం ద్వారా రూ.12,500/- లు పెట్టుబడి సహాయం అందిస్తున్నారు.రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతుల రికార్డులను సరిచేసి, ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా అందే విధంగా చర్యలు తీసుకోవల్సిందిగా అధికారులను కోరాం.బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధనకు గ్రామ సచివాలయాలను జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు.గాంధీజీ పుట్టిన రోజునే గ్రామ సచివాలయాలను వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. గ్రామస్థాయిలోనే ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంది.గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు, అవినీతి, అక్రమాలను సరిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి పెడుతున్నాం.రైతాంగానికి సాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాలలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవలసిందిగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నాం.గ్రామాలలో మౌలిక వసతుల ఏర్పాటు కు కృషి చేస్తున్నాం.ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here