ఘనంగా మొదలైన ఘటోఉత్సవం

0
174

వెంకటగిరి, సెప్టెంబర్ 15 : వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన జాతరలలో పోలేరమ్మ జాతర ఒకటి. ఈ జాతరలో భాగంగా కాంపాలెం నుండి ఘటం కుండలను చాకలి తలపై ధరించి పాలేరు తల్లిని స్మరిస్తూ జినిగుల వారి వీధి లో అమ్మవారికి నిర్మించిన మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడినుంచి రాజా గారి నగరి వెనుక తీసుకెళ్లి కర్ణకమ్మ వీధిలో సంప్రదాయం గా పూజలు నిర్వహిస్తారు. అలాగేవెంకటగిరి పట్టణ పరిధిలో ఉన్న ఇళ్లలో ఘటం కుండలు ధించుకుంటే పోలేరమ్మ కృపకు పాత్రులు అవుతారని భక్తుల అభిప్రాయం అమ్మవారికి బలి ఇచ్చే దున్నపోతుని ఘటం కుండలు వెంట త్రిప్పుతూ యువత చిందులతో ఘటం దించుకునే ప్రతి ఇంటి వద్దకు తీసుకొచ్చి భక్తుల మనోభావాలకు ధీటుగా ఘటోఉత్సవం సాగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here