దేశంలోనే తొలికలెక్టర్ గా అంధ మహిళ

0
75

తిరువనంతపురం, అక్టోబర్‌ 15, : దేశంలోనే తొలి అంధ మహిళా ఐఎఎస్‌ ప్రాంజల్‌ పాటిల్ (31)
తిరువనంతపురం సబ్‌ కలెక్టర్‌గా సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రాంజల్‌ పాటిల్‌ మహారాష్ట్రలోని
ఉల్‌హస్‌నగర్‌కు చెందినవారు. ఆమె తన ఆరేళ్ళ వయస్సులోనే కంటి చూపు కోల్పోయారు. ఐఎఎస్‌ కావాలన్న ఆమె లక్ష్యానికి అంధత్వం ఏ మాత్రం అడ్డంకి కాలేదు. అనేక అవరోధాలను దాటుకుని సివిల్‌ సర్వీసులకు ఎంపికైన తొలి అంధ మహిళగా నిలిచారు. తిరువనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కె. గోపాలకృష్టన్‌, ఇతర సిబ్బంది సమక్షంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here