అమరావతి, పోలవరానికి ఆటోనగర్ తో ఏం సంబంధం లేదు – మంత్రి అనీల్‌

0
39

పోలవరం, అమరావతి ఆగిపోవడం వల్ల విజయవాడ ఆటోనగర్ కుదేలైందని జరుగుతోన్న ప్రచారం అవాస్తవమని జలవనరులశాఖ మంత్రిఅనిల్ కుమార్ యాదవ్‌ స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాధతో, ఒర్వలేక కొన్ని పత్రికల్లో కథనాలు రాస్తున్నారని ఆటోనగర్ ప్రారంభించి 30-40 ఏళ్లైందన్నారు.అమరావతి, పోలవరానికి ఆటోనగర్ తో ఏం సంబంధం ఉందన్నారు. తన బందువుకు కాంట్రాక్టు రాకపోతే పోలవరం ఆగిపోయినట్లేనా అని ప్రశ్నించారు. కియా వెనక్కి వెళ్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబు వద్ద పీఎ గా పనిచేసిన వారి వద్ద ఐటీ దాడుల్లో కోట్లు పట్టుబడినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వాన్ని కించపరిచేలా పత్రికలు వ్యవహరించవద్దని కోరుతున్నామన్నారు. పోలవరం లో 850కోట్లు రివర్స్ టెండరింగ్ వల్ల వైకాపా ప్రభుత్వం మిగిల్చిందని నిర్ణీత సమయానికి పోలవరాన్ని పూర్తి చేసి తీరతామన్నారు. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఐపీఎస్ ఎబీ వెంకటేశ్వరరావుపై అధికార దుర్వినియోగంపై తెదేపా నేతలే మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మంచిని గుర్తించక పోయినా పర్వాలేదు…వక్రీకరించి రాయవద్దని పత్రికలను కోరుతున్నామన్నారు. ఎబీ వెంకటేశ్వరరావును మేము టార్గెట్ చేశామనడం ఏంటి..ఐపీఎస్ అధికారి ఎబీ వెంకటేశ్వరరావు ఏం చేశారో తెదేపా ఎంపీనే ట్వీట్ లో తెలిపారు. ఎబీవీ తప్పుంటే శిక్షపడుతుందని 80-90 శాతం అధికారులు నిజాయితీగా ఉన్నారు. ఒకరిద్దరు తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటే అందరిపై తీసుకున్నట్లు ఎలా భావిస్తారని ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here