దేవాలయాలలో చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

0
147

జిల్లాలో మొత్తం 16 చోట్ల దొంగతనాలకు పాల్పడిన ముద్దాయిలు
రూ.2,00,000/- విలువ గల బంగారు ఆభరణాలు మరియు వెండి వస్తువులు స్వాధీనము
చోరీకి ఉపయోగించే పరికరాలతో సహా నిందితులను పట్టుకున్న క్రిష్ణపట్నం సర్కిల్ పోలీసులు

నెల్లూరు, అక్టోబర్‌ 24 : 11-09-2019 న రాత్రి తోటపల్లి గూడూరు మండలం కొత్తకోడూరు గ్రామంలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయం తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించి, అమ్మవారి బంగారు
ఆభరణాలు, హుండీ దొంగిలించిన కేసు పలు దేవాలయాలలో చోరీల కేసులను చేధించాలని నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఇచ్చిన ఆదేశాల మేరకు, నెల్లూరు రూరల్ డియస్పి కెవి.రాఘవ రెడ్డి పర్యవేక్షణలో, కృష్ణపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్‌కె. ఖాజావలి, తోటపల్లి గూడూరు యస్.ఐ.మనోజ్ కుమార్, ముత్తుకూరు యస్.ఐ ఎం.అంజిరెడ్డి, కృష్ణపట్నం యస్.ఐ. ఏ.శివకృష్ణా రెడ్డి సిబ్బంది, ఒక ప్రత్యేక బృందముగా ఏర్పడి దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలో చోరీలు చేసి తప్పించుకొని తిరుగుచున్న ఇద్దరు పాత దొంగలను గురువారం నరుకూరు సెంటర్ సమీపంలో అరెస్ట్ చేసి వారి వద్ద తోటపల్లి గూడూరు, ముత్తుకూరు, నెల్లూరు రూరల్, ఇందుకూరిపేట, విడవలూరు, సంగం, కొడవలూరు, ఆత్మకూరు, కావలి, పొదలకూరు, ఏఎస్‌ పేట సూళ్ళూరుపేట, పెళ్ళకూరు పోలీస్ స్టేషన్ల పరిధిలలోని మొత్తం 16 కేసులలో చోరీ సొత్తు స్వాధీన పరచుకోవడమైనది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here