ఫిబ్రవరి నెలకు ఎంత చెల్లించారో మార్చి నెలకు అంతే చెల్లించండి.. ఏపీఎస్ పి డి సి ఎల్

0
130

కరోనా వైరస్ ప్రభావంతో మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిస్కం పరిధిలోని వినియోగదారులు ఫిబ్రవరి నెలలో ఎంత బిల్లు చెల్లించారో అదే మొత్తాన్ని మార్చి నెలకూ చెల్లిస్తే సరిపోతుందని ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ జె.పద్మ జనార్దనరెడ్డి మీడియాకు తెలిపారు. ఒకవేళ విద్యుత్‌ వినియోగంలో హెచ్చు తగ్గులుంటే వచ్చే నెలలో ఆ మేరకు సర్దుబాటు చేస్తామని వివరించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్ డౌన్‌తో అంతా ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అందించేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా 24 గంటల్లో కరెంట్ అందిస్తున్నారు. దీంతో ఇంట్లోనే ఉండేవాళ్లు.. సినిమాలు చూస్తే కాలక్షేపం చేస్తున్నారు.

విద్యుత్‌ కు సంబంధించిన సమస్యలుంటే 1912 నెంబరు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పద్మ జనార్దన్‌రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇంటిలోనే ఉంటూ సహకరిస్తున్న విద్యుత్‌ వినియోగదారులకు, నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరాకు సహకరిస్తున్న ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ వైరస్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించే వరకు ఇదే సహకారాన్ని అందించాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here