ఇసుక పై ప్రభుత్వం సంచలన నిర్ణయం

0
150

బలహీన వర్గాలకు మంజూరు చేసే ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఇసుక ఉచితంగా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సహాయ పునరావాస ప్యాకేజీ కింద నిర్మించే ఇళ్లకు కూడా ఇసుక ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాగులు, వంకలు, ఏర్లలోని ఇసుకను స్థానిక అవసరాలకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో తీసుకెళ్తే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం సచివాలయం అధికారుల నుంచి ఉచిత సర్టిఫికెట్లు తీసుకోవాలని సూచించింది. కానీ కండిషన్స్ అప్లై అంటోంది. 1,2,3 ఆర్డర్‌ రీచ్‌లలో మాత్రమే అనుమతి తెలిపింది.. సొంత అవసరాలు, బలహీనవర్గాల గృహ నిర్మాణం, సహాయ పునరావాస ప్యాకేజీలకు మాత్రమే ఇసుకను ఉచితంగా తీసుకెళ్లొచ్చని తెలిపింది. ఒకవేళ ఎవరైనా సొంత అవసరాలకు ఇసుక తీసుకెళ్లానుకుంటే గ్రామ, వార్డు సచివాలయాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి కోరిన వారి వివరాలు నమోదు చేసుకుని, ఎలాంటి ఫీజు లేకుండా సచివాలయాలు అనుమతి పత్రం ఇస్తాయి. బలహీన వర్గాల గృహ నిర్మాణం, సహాయ, పునరావాస ప్యాకేజీలకు సంబంధించిన పనులకు ఉచితంగా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లేందుకు కలెక్టర్‌ అనుమతి తీసుకోవాలి. అలాగే కలెక్టర్‌ బాధ్యతలు అప్పగించిన మరో అధికారి అయినా అనుమతి ఇవ్వొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here