చంద్రయాన్ ప్రయోగం వాయిదా

0
168

జులై 15 : యావత్ భారత దేశం ఎదురు చూస్తున్న చంద్రయాన్ -2 రెండవ దశ ప్రయోగం కార్యక్రమం వాయిదా పడింది . సాంకేతిక కారణాలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ముందు గా నిర్ణహించిన దాని ప్రకారం నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ సెంటర్ నుండి సోమవారం తెల్లవారు జామున 02:51 నిమిషములకు చంద్రయాన్ – 2 ప్రయోగం జరగాల్సి ఉంది . దీనికి సంబంధించి కౌంట్ డౌన్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది . నిరంతరాయం గా 20 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగిన తరువాత జిఎసైల్వి మార్క్ – 3 వాహన నౌక నింగి లోకి వెళ్లాల్సి ఉంది . కానీ సాంకేతిక లోపం వల్ల 19 గంటల 4 నిమిషాల 36 సెకండ్ల పాటు కౌంట్ డౌన్ కొనసాగిన తరువాత సాంకేతిక లోపాల వల్ల ఇస్రో శాస్త్రవేత్తలు అర్ధాంతరం గా కౌంట్ డౌన్ ను నిలిపి వేశారు . ఈ ప్రయోగాన్ని చూసేందుకు సుదీర్ఘ ప్రాంతాల నుండి వేలాది మంది వీక్షకులు నిరాశతో వెనుదిరిగి వెల్లాసి వచ్చింది . కాని ఈ ప్రయోగాన్ని త్వర లోనే తిరిగి ప్రారంభిస్తారని అనధికార సమాచారం . జిఎసైల్వి మార్క్ – 3 లో ఎందుకు సాంకేతిక లోపం ఏర్పడింది అన్న విషయం పై విచారణ కమిటీ ని కూడా నియమించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం . వివరాల్లో కెళితే శ్రీహరికోట నుండి జరగాల్సిన రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసిన ఇస్రో శాస్త్రవేత్తలు . 02 :51 నిమిశాలకు జరగాల్సిన ప్రయోగాన్ని 56 నిమిషము ల 24 సెకండ్ల కు ముందు నిలిపివేశారు . మీడియా సెంటర్ లో కౌంట్ డౌన్ నిలిచి పోవడం తో నెలకొన్న ఉత్కంఠత . రాకెట్ లో సాంకేతిక లోపం గుర్తించి వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ప్రకటన. మళ్ళీ అంర్జాతీయం గా అనుమతులు వచ్చాకే . సాంకేతిక కారణాలతో చంద్రయాన్‌-2 ప్రయోగ ప్రక్రియను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) నిలిపివేసింది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here