వి.ఆర్.కళాశాలని మరింత అభివృద్ధి చేసి చూపిస్తా – మంత్రి పి.అనీల్‌

0
64

నెల్లూరు, అక్టోబర్‌ 29 : నెల్లూరు వి.ఆర్.కళాశాలను జలవనరులశాఖ మంత్రివర్యులు డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ సందర్శించారు.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ తో కలిసి మౌళిక వసతులపై ఆరాతీశారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూనెల్లూరు నగర నడిబొడ్డున ఇంతటి కళాశాల ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. వి.ఆర్.కళాశాలని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. వి.ఆర్. కళాశాల చరిత్రలో ఒక మంత్రి వి.ఆర్.కళాశాలకు వచ్చి ఉపాధ్యాయుల, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చేస్తాను అన్న ఒకేఒక మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.వి.ఆర్. కళాశాల అభివృద్ధి బాధ్యతలు నూతన కమిటి ఏర్పడే వరకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అప్పగించారు.ఇందులో అన్ని రాజకీయ పార్టీలు,ప్రజా సంఘాలను, మేధావుల సమన్యయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోరారు.

Add

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here