కార్పోరేట్ విద్యాశక్తుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాం

0
74

ఇది తొలి అడుగు మాత్రమే… రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు, అక్టోబర్‌ 01 : మంగళవారం నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలలో విద్యా ప్రమాణాలు, ఫీజులు విద్యార్ధుల వసతులపై అధికారులతో కలసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, అధికారులను వెంటతీసుకొని ఒక ఎమ్మెల్యేగా నేను వెళ్తే, వాళ్ళు చెప్పిన సమాధానం విని, అధికారులు సైతం నివ్వెరపోయారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జి.ఓ. ప్రకారం ఇంటర్మీడియట్ కు ఫీజు 3500రూపాయలు అయితే ఈ కార్పోరేట్ కళాశాలలు మాత్రం లక్షల్లో ఫీజీలు వసూలు చేస్తున్నారన్నారు. కోచింగ్ సెంటర్ల పేరుతో అనుమతులు లేకుండా, ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ పెట్టి సామాన్య, మధ్యతరగతి ప్రజలను ముక్కుపిండి ఫీజులు లక్షల్లో వసూలు చేస్తున్నారన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజల చెమటను రక్తంగా మార్చి, వారి పిల్లలకు ఫీజులు కడుతున్నారన్నారు. అందుకే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఈ కార్పోరేట్ శక్తుల విద్యా మాఫియాకి, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం ప్రారంబించామన్నారు. ఇది తొలి అడుగుమాత్రమే అని, కొన్ని కార్పోరేట్ శక్తులు కొన్ని కోట్ల మంది సామాన్య, మధ్యతరగతి ప్రజల కుటుంబాలను ఛిద్రం చేస్తున్నారన్నారు. దురదృష్టకరం ఏమిటంటే అనేక స్కూళ్ళకు, కాలేజీలకు అనుమతులు లేవన్నారు. రేపు జరగరానిది జరిగితే ఆ విద్యార్ధులకు దిక్కెవరని ప్రశ్నించారు. అధికారులు స్కూళ్ళకు 5 రోజులు, కాలేజీలకు 15 రోజులు సమయం తీసుకొని, సమగ్ర నివేదికను ఇస్తారన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. నేను ఎప్పుడూ అధికార పక్షమా, ప్రతిపక్షమా అని ఆలోచన చేసేవాడిని కాదని, నేను ఎప్పుడు ప్రజల పక్షమేనన్నారు. ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్.సి.పి. నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావు, బొబ్బల శ్రీనివాస యాదవ్, విద్యార్ధి నాయకులు జి.వి. ప్రసాద్, జయవర్ధన్, మధన్ మోహన్ రెడ్డి, శేషు, తరుణ్ రెడ్డి, ప్రశాంత్, చిన్నా, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Add

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here