శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణస్వీకారం

0
16

నెల్లూరు, డిసెంబర్‌ 29 : ఆదివారం నరసింహకొండలోని శ్రీశ్రీశ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహాత్సవంలో జలవనరుల శాఖామంత్రి పోలు బోయిన
అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో కలిసి కావలి మాజీ శాసనసభ్యులు, వైయస్ఆర్సిపి నాయుకులు బీద మస్తాన్ రావు కార్యక్రమంలో పాల్గొన్నారు.
బీద మస్తాన్ రావు మాట్లాడుతూ నూతన దేవస్థాన చైర్మన్ గా ఎన్నుకున్న పి.శ్రీనివాసులు రెడ్డిని వారి బృందాన్ని అభినందిస్తూ దేవస్థాన అభివృద్ధికి పట్టుదలతో కృషి చేయాలంటూ తన వంతు సహకారం అందిస్తానని బీద మస్తాన్ రావు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా దేవాదాయ శాఖలో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో ఉండలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్‌డిసిసిబి ఛైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్స్, తదితర వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు, భక్తులు పాల్గొన్నారు.

Add

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here