ఊబకాయం బలం కాదు… రుగ్మతలకు నిలయం

0
85

నెల్లూరు, సెప్టెంబర్‌ 25 : ప్రస్తుతం పిల్లల నుండి పెద్దల వరకు అన్ని వయస్సుల వారిని వేధిస్తున్న సమస్య స్థూలకాయం, తీసుకునే ఆహారం మొదలు, సాగించే జీవన శైలి వరకు సరైన జాగ్రత్తలు
పాటించకపోవడం వల్లే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు స్థూలకాయంతో బాధపడుతున్నారని నారాయణ హాస్పిటల్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్‌ టి.సునంద అన్నారు. ఈ సందర్భంగా బుధవారం నారాయణ హాస్పిటల్‌ నందు అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డా బిజు రవీంధ్రన్, మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్‌ వై.వి. ప్రభాకర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఊబకాయ నిర్ధారణకు ఎండోక్రైనాలజి విభాగం నేతృత్వంలో ఒక ప్రత్యేక హెల్త్ ప్యాకేజిని ఈ రోజు నుండి 30 రోజుల పాటు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. సుమారు రూ.5000 వరకు ఖర్చు అయ్యే ఈ ప్యాకేజిని కేవలం రూ1500/- లకీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ హెల్త్ ప్యాకేజి కేవలం సామాజిక సేవా దృక్పథంతో ఊబకాయ నిర్ధారణకు చక్కని పరిష్కారం అవుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంటోడ్రైనాలజిస్ట్ డా టి.సునంద మాట్లాడుతూ ఈ హెల్త్ ప్యాకేజి ద్వారా “ముద్దుగా ఉండొచ్చు… బొద్దుగా అసలొద్దు”, “బాల్యం ”భారంగా కాదు… భద్రంగా ఎదగనిద్దాం”అనే నినాదంతో ప్రజలకు ఊబకాయం పై అవగాహన కల్పించేందుకు మా ఎండోక్రినాలజీ విభాగం శ్రీకారం చుట్టిందని అన్నారు. ఇప్పుడు మారిన జీవనశైలిలో పిల్లల్లో సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం వలన స్థూలకాయ సమస్య ఏర్పడుతుందన్నారు. తద్వారా చిన్న వయస్సులోనే షుగర్, రక్తపోటు వంటి దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కేవలం తల్లిదండ్రులకు సరైన అవగాహన లేకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణం అని తెలియజేశారు. అలాగే పెద్దలకు కూడా ఇదే సమస్య, తీసుకోవల్సిన ఆహారపు ప్రమాణాలు, వ్యాయామ లోపం కారణం అన్నారు. ఇందుకోసం నెల రోజులపాటు ఎండోక్రైనాలజీ విభాగం, నారాయణ సూపర్ స్పెషాలిటీ విభాగం మొదటి అంతస్తులో ఒక ప్రత్యేక విభాగమును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. న్యూట్రీషియన్ల పర్యవేక్షణలో ఆహారపు నియమాలపై ప్రత్యేక కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేయడమైనది. అలాగే ఈ ప్యాకేజీలో ప్రత్యేకంగా “బాడీ ఫ్యాట్ మెజరిమెంట్”, డిఈఎక్స్‌ఏ స్కాన్ ద్వారా శరీరంలో ఉన్న కొవ్వు, నీరు, ఎముకల పటిష్టతను పరీక్షించడం జరుగుతుందని తెలిపారు. ఊబకాయం పై ఒక హెల్త్ ప్యాకేజిని మొదటిసారిగా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ హెల్త్ ప్యాకేజీ కొరకు వచ్చే వారు 7331170063 నంబరుకి ఫోన్ చేసి తప్పనిసరిగా అపాయింట్ మెంట్ తీసుకొనవలెను, అలాగే మరిన్ని వివరములను తెలసుకొనవచ్చును, చెకప్ కు వచ్చేటప్పుడు ఉదయం పరగడుపున ఎలాంటి ఆహారపానీయాలు తీసుకొనరాదు. ఈ సమావేశంలో నారాయణ హాస్పిటల్ ఏజిఎమ్‌ సిహెచ్‌. భాస్కర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Add

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here