మాట ఇస్తే మాట తప్పని, మడమతిప్పని నేత వైఎస్‌ జగన్ – కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

0
61

నెల్లూరు, అక్టోబర్‌ 16 : బుధవారం నెల్లూరు రూరల్ కార్యాలయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, దివంగత మహానేత వై.యస్. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఏదైతే ప్లీనరీలో రైతు భరోసా పధకం ప్రకటించాడో, నెల్లూరు జిల్లాలో ఆ పధకాన్ని ప్రారంభించడం జిల్లాకే గర్వకారణం అని అన్నారు. రైతు భరోసా పథకాన్ని చెప్పిన దానికంటే ముందుగా ప్రకటించిన ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రైతు భరోసా సొమ్మును 50 వేల రూపాయల నుండి 67,500 రూపాయలకు పెంచి రైతులపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని, అధికారంలోకి వచ్చిన 5 నెలలకే ఎన్నికల హామీలను 90% నెరవేర్చారన్నారు. మాటఇస్తే మాటతప్పని, మడమ తిప్పని నేత వై.యస్. జగన్ మోహన్ రెడ్డిని కొనియాడారు. వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత వర్షాలు పడి డ్యాంలు అన్ని నిండుకుండలా ఉన్నాయన్నారు. మనసున్న మారాజు ముఖ్యమంత్రి అయితే అన్నీ వాటికి అవే కలసివస్తున్నాయని, వై.యస్.ఆర్. రైతు భరోసా కార్యక్రమానికి 300 బస్సులు, 1500 ఆటోలు, 150 ట్రాక్టర్లతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ రైతులకు, నాయకులకు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావు, జిల్లా అధికార ప్రతినిధి బిరుదవోలు శ్రీకాంత్ రెడ్డి, బొబ్బల శ్రీనివాస యాదవ్, ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, బర్నాబాసు, పచ్చా రవి, హజరత్ నాయుడు, మేఘనాధ్ సింగ్, మందా పెద్ద బాబు తదితరులు పాల్గొన్నారు.

Add

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here