డెంగ్యూను నియంత్రించాలని జేసికి వినతి

0
103

నెల్లూరు, నవంబర్‌ 11 : నెల్లూరు జిల్లాలో డెంగ్యూను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ జేసీని కలిసి వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ గత మూడు నెలలుగా జిల్లాలో డెంగ్యూ విజృభిస్తుందన్నారు. అవగాహన కల్పించడంలో, డెంగ్యూను నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో శానిటేషన్ అద్వాన్నంగా ఉందని ఇప్పటికైనా అధికారులు స్పందించి దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు స్పందించకుంటే తెలుగు యువత ఆధ్వర్యంలో డివిజన్ల వారిగా అవగాహన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.

Add

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here