“అటల్ టింకరింగ్ లేబొరేటరీ”ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి

0
42

తోటపల్లి గూడూరు, డిసెంబర్‌ 03 : తోటపల్లి గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు “అటల్ టింకరింగ్ లేబొరేటరీ”ని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,విద్యార్థులను మంచి ప్రతిభావంతులుగా తీర్చుదిద్దేoదుకు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ కింద లేబొరేటరీని ఏర్పాటు చేయడం సంతోషం అన్నారు.విద్య, వైద్యం అనేది భారతరాజ్యాంగములో ప్రతి ఒక్కరికి కల్పించిన హక్కు అన్నారు.కాకపోతే విద్యా, వైద్య వ్యవస్థ అనేది కొందరు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లి, కొందరు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆవిధంగా ఉండకూడదు అందరికి అందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చారు.ఎవరైనా సరే అమ్మ ఒడి యొక్క మాధుర్యం, గొప్పతనం తెలియని వారు ఉండరు.అటువంటి పేరుతో చదువుకు దూరమైన వారిని అక్కున చేర్చుకోవడం కోసం అమ్మ ఒడి పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ పెట్టారని చెప్పారు.ఎవరూ చేయని విధంగా పెట్టారు కాబట్టి అందరం జగనన్న అమ్మ ఒడి అని పేరు పెట్టమని చెప్పడం జరిగింది.ఈ పథకం శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచి పోతుంది.జెడ్పీ చైర్మన్ గా ఉన్న సమయంలో పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించానని చెప్పారు.అప్పట్లో ఇసుక వేలంలో 2.97 కోట్లు ఆదాయం ప్రభుత్వం కు వచ్చింది. జిల్లాలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి దృష్టి కి తీసుకుని వెళ్ళాను. మారుమాట్లాడకుండా ఇసుక ద్వారా వచ్చిన నగదును మొత్తం పాఠశాలల్లో సౌకర్యాలకు ఖర్చు పెట్టమని చెప్పిన గొప్ప మనిషి రాజశేఖర్ రెడ్డి .దాదాపుగా 12 సంవత్సరాల తరువాత ఇంత వరకు ఏమిచేయని పరిస్థితి.కానీ మహానేత తనయుడు జగన్మోహన్ రెడ్డి పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు నాడు-నేడు పేరుతో శ్రీకారం చుట్టారు.విద్యార్థులు నిర్దేశించినటువంటి ఆచరించ దగ్గ ఒక ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలి.అప్పుడే ఆ లక్ష్య సాధనకు చేరుకోగలరు. ఉపాధ్యాయులు బిడ్డలను తమ బిడ్డలుగా చూసుకోవాలి.సమాజంలో కొందరు మిమ్మల్ని చెడు మార్గంలో తీసుకొని వెళతారు.సమాజంలోని అన్ని విషయాలను తెలుసుకొని జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉంది.చిన్నారులు ముందు తల్లితండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించడం నేర్చుకోవాలి.అప్పుడే మీరు జీవితంలో ఒక మెట్టు ఎక్కినట్టు.తల్లిదండ్రుల రుణం తీర్చుకొవడమంటే మీకు జన్మనిచ్చిన వారికి మంచి పేరు తీసుకొని రావడం.విద్యార్ధి జీవితం కన్నా సంతోషం మరొకటి లేదు.ఈ పాఠశాలలో విద్యార్థులు ఇంగ్లీష్ బాగా మాట్లాడు తున్నారు.కానీ చాలా మంది ఇంగ్లీష్ భాషపై అనవసర రాద్దాంతాలు చేస్తున్నారు.తెలుగు భాష ను గౌరవిస్తూనే, ఇంగ్లీష్ నేర్చుకోవాలి.ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, విద్యార్థులు , ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.

Add

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here