డివిజన్లలోని సమస్యలను డివిజన్ ఇన్‌ఛార్జ్‌లు పరిష్కరిస్తారు

0
64

నెల్లూరు రూరల్ కార్యాలయ ఇన్ ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు, నవంబర్‌ 06  : బుధవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 27వ డివిజన్ లో పర్యటించారు. 27వ డివిజన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు 27వ డివిజన్ ఇన్‌ఛార్జ్ బూడిద పురుషోత్తం యాదవ్ తలపెట్టిన మీ ఇంటికి – మీ డివిజన్ ఇన్ ఛార్జ్ యాత్ర కార్యక్రమాన్ని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ ఛార్జ్కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, బూడిద పురుషోత్తం యాదవ్ మీ ఇంటికి – మీ డివిజన్ ఇన్ ఛార్జ్ యాత్రను ప్రారంభించి, స్థానిక డివిజన్ లో ఉన్న సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారమే ధ్యేయంగా
ముందుకు సాగాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డివిజన్ ఇన్ ఛార్జ్ లకు ఆదేశాలు జారీచేశారన్నారు. ఇప్పటికే అనేక డివిజన్లలో ఈ యాత్ర ప్రారంభం అయ్యిందన్నారు. స్థానికులకు ఏవైనా సమస్యలు ఉంటే మీ డివిజన్ ఇన్ ఛార్జ్ కు ఫోన్ చేసి, తెలియజేస్తే ఆ సమస్య పరిష్కారం కోసం డివిజన్ ఇన్ ఛార్జ్ లు కృషి చేస్తారని, అలాగే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా డివిజన్ ఇన్ ఛార్జ్ లు, అధికారులు సమన్వయంతో పనిచేసి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి మంచి పేరు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ బూడిద పురుషోత్తం యాదవ్, మురారి, చెక్కా సాయి సునీల్, సుబ్బా రెడ్డి, అమరేంద్ర రెడ్డి, రమణా రెడ్డి, జావీద్, రఫి, మున్నా, బాబు రావు, హసీనమ్మ, శంకర్, గౌసున్నీస్సా తదితరులు పాల్గొన్నారు.

Add

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here