ఎన్నికల నిర్వహణకు అందరూ సమాయత్తం కావాలి – ఎన్నికల కమీషనర్‌

0
19

నెల్లూరు, జనవరి 10 : రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టరు ఎమ్.వి.శేషగిరిబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు తెలిపారు.శుక్రవారం ఉదయం రాష్ట్ర ఎన్నికల కమిషనరు ఎన్.రమేష్ కుమార్ విజయవాడ ఎన్ఐసి కార్యాలయం నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో, జడ్పిటిసి, ఎం.పి.టి.సి., గ్రామపంచాయితీ ఎన్నికల ఏర్పాట్ల పై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల వారీగా సమీక్షించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనరు మాట్లాడుతూ జడ్పిటిసి, ఎం.పి.టి.సి. ఎన్నికలకు సంబంధించి ఈనెల 17వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఫిబ్రవరి నెలలో ఎన్నికలు 2 విడతలలో జరపాల్సి వుంటుందన్నారు. గ్రామపంచాయితీ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి మొదటివారంలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఎన్నికల నిర్వహణకు అందరూ సమాయత్తం కావాలన్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు.జిల్లా నుంచి జిల్లా కలెక్టరు ఎమ్.వి. శేషగిరిబాబు మాట్లాడుతూ ఓటర్ల జాబితా ముద్రణ మంగళవారానికి పూర్తి చేశామన్నారు. జిల్లాలోని 56 మండలాలకు గాను మొదటి దశలో 21 మండలాల్లో రెండవదశలో 25 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో కావలసినన్ని బ్యాలెట్ పెట్టెలు సిద్ధంగా వున్నాయని, అన్నీ పని చేసే స్థితిలో వున్నాయన్నారు. ఎన్నికల రిటర్నింగు అధికారిగా నుడా వైస్ చైర్మెన్ శ్రీ బాపి రెడ్డిని నియమించామన్నారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కూడా యిప్పటికే గుర్తించామన్నారు. శాంతిభద్రతలకు సంబంధించి గట్టి పోలీసు బందోబస్తు ప్రణాళికను జిల్లా పోలీసు అధికారితో చర్చించి రూపొందించామన్నారు. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషనరు సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విజయవాడ నుండి రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది,జిల్లా నుంచి జిల్లా పోలీసు అధికారి భాస్కర్ భూషణ్, జడ్పి సి.ఇ.ఓ. పి. సుశీల, డి.పి.ఓ. ధనలక్ష్మి, ఎస్.బి. డిఎస్పి కోటా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Add

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here