జనవరి 11న సంఘీభావ సమావేశం.. అరవ పూర్ణ ప్రకాష్

0
28

11న అంబేద్కర్ భవన్లో సంఘీభావ సమావేశం. ముఖ్య అతిథులుగా కత్తి పద్మారావు. నెల్లూరు ఉదయం న్యూస్ ప్రతినిధి. ఈ నెల 11వ తేదీ స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఎస్సీ ఎస్టీ బిసి ముస్లిం మైనారిటీ కులమతాలకు అతీతంగా సంఘీభావ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ దళిత సేన రాష్ట్ర కార్యదర్శి అరవ పూర్ణ ప్రకాష్ పేర్కొన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ పౌరసత్వ సవరణ బిల్లును తీసుకురావడం సమంజసం కాదన్నారు. అట్రాసిటి కేసులను నిర్వీర్యం చేస్తూ దళిత బహుజనుల ఆత్మగౌరవాన్ని కించపరచడం తగదని హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ అగ్రవర్ణాల్లోని పేదలకు హక్కులను కాల రాసేందుకు కుటిల రాజకీయ ప్రయత్నాలు మానుకోవాలని తన ఆవేదనను వ్యక్తపరిచారు. కుల మతాల మధ్య వివాదాలు తెర లేపి ఆధిపత్య పోరు సాధించాలనుకునే వారికి ప్రజలే సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. 11వ తేదీ అంబేద్కర్ భవన్లో జరుగు సంఘీభావ సమావేశానికి జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ దళిత బహుజన అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు ఆసిఫ్ భాష, భాషా భాయ్, షఫీ తదితరులు పాల్గొన్నారు.

Add

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here