గిరిజనుల వార్షిక ఆదాయం పెంచుతారా, లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ ఆదాల

0
58

గిరిజనుల వార్షిక ఆదాయం పెంచుతారా ..

లోక్ సభ లో ప్రశ్నించిన నెల్లూరు ఎంపీ ఆదాల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం విశాఖపట్నం నెల్లూరు ప్రాంతాల్లోని గిరిజన సముదాయాలకు వార్షిక ఆదాయం పెంపుదల గురించి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు సోమవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే ఈ సమావేశాల్లో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కొన్ని ప్రశ్నలను సంధించారు అయితే సమయాభావం వల్ల ఆయన అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా ఆయా శాఖలు సమాధానం పంపాయి. కర్ణాటక రాష్ట్రంలోని తూర్పు పశ్చిమ కనుమల మధ్య నివసిస్తున్న గిరిజనులకు వార్షిక ఆదాయాన్ని పెంపుదల కోసం చాలా చర్యలు చేపట్టారని ఎంపి తెలిపారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం విశాఖపట్నం నెల్లూరు ప్రాంతాల్లో నివసించే గిరిజన సముదాయాలకు దీనిని వర్తింప చేస్తారా అని ఆదాల ప్రశ్నించగా కేంద్ర గిరిజన శాఖ మంత్రి చంద్రశేఖర్ బెల్లాన అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు
అదేవిధంగా జీడీపీని ప్రభావితం చేసే కార్పొరేట్ టాక్స్ , క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ అంశాల గురించి ప్రశ్నించగా ఆయా మంత్రిత్వ శాఖల నుంచి సమాధానాలు అందాయి.

Add

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here