అక్కంపేట చెరువుకు కండలేరు నీటి విడుదల పరిశీలన

0
69

చేప పిల్లలు వదిలిన ఎమ్మెల్యే
మనుబోలు, అక్టోబర్‌ 29 : సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం అక్కంపేట గ్రామ చెరువు వద్ద కండలేరు జలాశయం నుండి సరఫరా అవుతున్న సాగునీటిని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి అధికారులు, రైతులతో కలిసి ప్రారంభించారు. కాలువలోని నీటికి పూజలు నిర్వహించారు.అక్కంపేట చెరువులో చేప పిల్లలను ఎమ్మెల్యే కాకాణి వదిలారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.దాదాపుగా పది సంవత్సరాలుగా సాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడ్డారు, గతంలో నిబ్బరంగా పంట సాగు చేసుకోలేని పరిస్థితి వుండేది.మహానేత పాలన మొదలైనది అనే దానికి జలాశయాలు నీటితో నిండడమే నిదర్శనం అన్నారు.గతంలో సాగునీటి విషయంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు.నీళ్లు రావు అనే ప్రాంతాలకు కూడా సాఫీగా నీరు అందిస్తాము.బండేపల్లి కాలువకు గతంలో కొందరు ప్రభుద్దులు అనధికారికంగా శంకుస్థాపన లు చేసిన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.కానీ ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లగానే, వెంటనే నిధులు మంజూరు చేశారు.రైతులను రైతులు గా చూస్తాం తప్ప, ఎక్కడా సాగు నీటి విషయంలో రాజకీయ జోక్యం ఉండదు.రైతులను ఈ ప్రభుత్వం అన్నీ విధాల ఆదుకొంటుంది.రాబోవు రోజులలో ప్రజలకు సంబంధించిన అన్ని మౌలిక వసతులు కల్పిస్తాము.ఈ కార్యక్రమం లో భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Add

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here