జగన్ పాలనలో అవస్థలు పడుతున్న అన్ని వర్గాల ప్రజలు – చేజర్ల

0
61

కోవూరు, నవంబర్‌ 10: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసమర్ధ పరిపాలన వలన రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. ఆదివారం కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయములో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పెనుమల్లి శ్రీహరి రెడ్డి అధ్యక్షతన జరిగిన కోవూరు పట్టణ తెలుగుదేశం పార్టీ సమావేశములో ముఖ్య అతిధిగా పాల్గొన్న వెంకటేశ్వర రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత గత తెలుగుదేశం ప్రభుత్వం లో ఉచితంగా ఇస్తున్న ఇసుక ను నిలిపివేసి లేని సమస్య సృష్టించారని దీని వలన భవన నిర్మాణ కార్మికులు పనులు లేక పస్థులు ఉండలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని,రాష్ట్రంలో పారిశుద్ధ్యం పై కనీస జాగ్రత్తలు తీసుకోక పోవడముతో విష జ్వరాలు విజృంభించి వందలాది మంది చనిపోతున్నారని,ప్రభుత్వ హాస్పిటల్ లో కనీసం మందులు కూడా లేవని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వర్షాకాలం ప్రారంభానికి ముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకొని దోమల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టితే దానిని వైస్సార్సీపీ నాయకులు ఎగతాళి చేసారని నేడు విషజ్వరాలు, డెంగీ జ్వరాల తో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని,2015వ సంవత్సరంలో జిల్లాలో దాదాపుగా 10 లక్షల ఎకరాలలో వరి సాగు చేసిన ప్పటికి నాటి తెలుగుదేశం ప్రభుత్వం ముందస్తుగా చేపట్టిన ప్రణాళిక వలన ఎక్కడ కూడా విత్తనాల కొరత ఏర్పడలేదని, నేదు 6 లక్షల ఎకరాల్లో వరి సాగుకు అనుమతించినప్పటికి ప్రభుత్వ చేతగాని తనము వలన విత్తనాలు కొరత ఏర్పడిందని,పనులు లేని కాలములో కనీసం 5 రూపాయలతో అన్న కాంటీన్లలో అన్న కడుపు నింపుకుందామంటే వాటిని కూడా మూసి వేసారని,పోలవరం ప్రాజెక్టును నిలిపి వేసారని, అమరావతిలో ఎక్కడ పనులు అక్కడ ఆపేసారని,ముఖ్యమంత్రి అహంకార పోకడలతో ప్రముఖ పారిశ్రామిక సంస్థలు అయిన ఆధాని, రిలయన్స్ లాంటి అనేక సంస్థలు రాష్ట్రం నుండి వెళ్లి పోతున్నాయని, పత్రికల నోరు నొక్కేందుకు జి ఓ 2430 తెచ్చారని,ముఖ్యమంత్రి నుండి మంత్రలు, శాసనసభ్యుల వరకు అందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు ను వేధించడానికే సమయమంతా కేటాయిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఏలూరు కృష్ణయ్య, పడవల ఆది శేషయ్య, ఇందుపూరు మురళి కృష్ణ రెడ్డి, సోమవరపు సుబ్బా రెడ్డి, గొర్రిపాటి నరసింహ, సాయి రోశయ్య, జక్కంరెడ్డి భాస్కర రెడ్డి,అగ్గి మురళి,ఉయ్యురు వేణు, మారుబోయిన వెంకటేశ్వర్లు,మన్నెపల్లి నాగేంద్ర,గుంజి పద్మనాభం, పూల వెంకటేశ్వర్లు,మౌలాలి,మహ్మద్, ఆడిపూడి కృష్ణమ్మ, అంబటి చిన్నక్క, గుంటా కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు

Add

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here