నేటి నుంచి ఎపి రైతు బజార్లలో ఉల్లి విక్రయాలు …

0
42

అమ‌రావ‌తి, నవంబర్‌ 24, (రవికిరణాలు) : ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రైతు బజార్లలో ఆదివారం నుంచి ఉల్లి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.బయట మార్కెట్లలో కిలో ఉల్లి ధర రూ.80 వరకు ఉండగా, రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిపాయలను రూ.25కే విక్రయించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.ఉల్లిని రూ.25కే విక్రయిస్తుండడంతో ప్రభుత్వంపై రోజుకు రూ.40 లక్షల భారం పడుతోంది.రైతు బజార్లలో ఉల్లిని విక్రయించేందుకు ప్రభుత్వం కర్నూలు జిల్లా రైతుల నుంచి రోజుకు 150 టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేస్తోంది.వాటిని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు, నగరాల్లోని రైతు బజార్లకు పంపిస్తోంది. ప్రస్తుతం రైతుబజార్లలో ఒక్కో వినియోగదారుడికి కిలో ఉల్లిపాయలను మాత్రమే ఇస్తున్నారు. ఉల్లి నిల్వలు పెరిగాక ఈ కోటాను పెంచనున్నట్టు మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు.

Add

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here