క్రీడాకారులకు చక్కటి వసతి కల్పించండి

0
44

తిరుచానూరు వద్ద గల పద్మావతి నిలయంను పరిశీలించిన కమిషనర్ గిరీషా

తిరుపతి, నవంబర్‌ 18 : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరుపతి లో నిర్వహిస్తున్న నేషనల్ అథ్లెటిక్ మీట్ నిడ్జమ్ కు వివిధ రాష్ట్రాల నుండి విచేస్తున్న క్రీడాకారులకు చక్కటి వసతి సౌకర్యాలు కల్పించాలని నగరపాలక సంస్థ, టిటిడి అధికారులకు కమిషనర్ గిరీషా సూచించారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో తిరుపతి తారక రామ స్టేడియం లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నిడ్జమ్ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా క్రీడాకారులకు వసతి కల్పించనున్న తిరుచానూరు సమీపంలో ఉన్న పద్మావతి నిలయం ను కమిషనర్ పరిశీలించారు. నీటి సౌకర్యం, మరుగు దొడ్లు, క్రీడాకారులు పడుకునేందుకు ఏర్పాటు చేయనున్న బెడ్లను పరిశీలించారు. ఎంత మంది క్రీడాకారులకు వసతి కల్పించనున్నారు, వారికి కల్పించాల్సిన వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున క్రీడాకారులు విచేస్తున్నారని, వారందరి చక్కగా వసతి సౌకర్యం కల్పించాలన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య పనులు చక్కగా నిర్వహించాలన్నారు. ఇప్పటి ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేశామని వారందరూ తమ విధులను చక్కగా నిర్వర్తించాలన్నారు. క్రీడాకారుల అవసరాలకు వినియోగించే నీటిని నగర పాలక సంస్థ అందిస్తున్నదన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ స్పోర్ట్స్ మీట్ లో ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా పనులు చేయాలని అధికారులకు సూచించారు. కమీషనర్ వెంట నగరపాలక సంస్థ ఎస్ఈ ఉదయ్ కుమార్, ఎంఈ చంద్ర శేఖర్, డిఈ చంద్రశేఖర్ రెడ్డి, టిటిడి ఈఈ మనోహర్, డిఈ వేణుగోపాల్, ఏఈ లు వంశీ కృష్ణ, మురళి మోహన్, తదితరులు ఉన్నారు.

Add

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here