ఆరోగ్యం పట్ల అవగాహన ఉంటే అనారోగ్యాలు దరిచేరవు

0
48

అన్నం బాకలో హోమియో వైద్య శిబిరం

చిల్లకూరు, నవంబర్‌ 28 : ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉంటే అనారోగ్యాలు వారి దరిచేరవని ఎన్.వి.రావ్ ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి.వి.రమణారెడ్డి కోరారు.చిల్లకూరు మండలం అన్నంబాక గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన మాజీ అధ్యాపకులు స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు పన్నెండవ వర్ధంతిని పురస్కరించుకొని ఎంవి రావు పౌండేషన్, శంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు అంగనవాడి చిన్నారులకు గ్రామస్తులకు విష జ్వరాలు వాటి పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరు జ్వరం వస్తే భయపడకూడదని వెంటనే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే అవి టైఫాయిడ్ డెంగ్యూ జ్వరాలుగా మారవు అని తెలిపారు.ప్రస్తుత సీజన్లో వస్తున్న జ్వరాల వల్ల రక్తంలో రక్త కణాల సంఖ్య తగ్గిపోతుందని రోగులను కొందరు భయపెడుతూ సొమ్ము చేసుకుంటున్నారని అలా కాకుండా జ్వరం రాగానే అవి టైఫాయిడ్ గా మారకుండా వెంటనే తమ పెరట్లో ఉన్న బొప్పాయి ఆకును రసం చేసుకొని తాగితే రక్త కణాలు తగ్గకుండా పెరుగుతాయని దాంతో జ్వరాలు తగ్గుతాయని అంతేగాక జ్వరం వచ్చిన రోగి విశ్రాంతి తీసుకుంటూ మంచి పండ్లు ఆహారంగా తీసుకుంటే ఎలాంటి జలాల వల్ల ఇబ్బంది కలగదని వారు తెలిపారు. అంతేగాక వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించాలని అలా చేస్తే ఎలాంటి సీజనల్ వ్యాధులు దరిచేరవని తెలిపారు.ప్రస్తుత వర్షాకాలంలో ముఖ్యంగా నీరు కలుషితం అయి ఉంటాయని కావున ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని కోరారు. తదుపరి పాఠశాల విద్యార్థులకు అంగనవాడి చిన్నారులకు గ్రామస్తులకు ఎంవి రావు ఫౌండేషన్ వారు అందజేసిన హోమియో మందులను మూడు రోజులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులు విజయలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.

Add

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here