కర్లపూడిలో హోమియో వైద్య శిబిరం

0
40

కోట, డిసెంబర్ 16 : కోట మండలం కర్లపూడి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎస్.సి మెయిన్ పాఠశాలల్లో సోమవారం కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం విద్యార్థులకు గ్రామస్తులకు విష జ్వరాలు రాకుండా ఎం.వి రావు పౌండేషన్ శంకర్ ట్రస్ట్ సౌజన్యంతో హోమియో వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరాన్ని పాఠశాల
ప్రధానోపాధ్యాయులు జి.సుబ్బారావు సి.ఆర్.పి.ఎం సునీత ప్రారంభించారు.ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు అధికంగా ఉన్నాయని వీటిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్త చర్యగా జ్వరాలు రాకుండా హోమియో మందులు మూడు రోజులు వాడాలి అని తద్వారా జ్వరాలు సోకని నిర్వాహకులు తెలిపారు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి నుంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని సుబ్బారావు కోరారు.అనంతరం పాఠశాల విద్యార్థులకు గ్రామస్తులకు జ్వరాలు టైఫాయిడ్ డెంగ్యూ రాకుండా హోమియో మందులు ఫౌండేషన్ నిర్వాహకులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Add

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here