ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం అరెస్ట్ …

0
87

అక్టోబర్‌ 16 : కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు పి.చిదంబరంను ఈడీ అరెస్ట్ చేసింది.ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు చిదంబరంను అరెస్ట్ చేశారు.చిదంబరం అరెస్ట్‌కు అనుమతించాలని ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న ప్రత్యేక కోర్టు నిన్న తీర్పును వెలువరిస్తూ చిదంబరంను ఈడీ ప్రశ్నించవచ్చని, అవసరమైన పక్షంలో అరెస్ట్ కూడా చేయొచ్చని ఆదేశాలు వెలువరించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం ఈడీ అధికారులు నేడు తిహార్ జైలుకు వెళ్లారు.చిదంబరంతో పాటు కార్తీ చిదంబరం, నళిని చిదంబరంను అధికారులు విచారించారు. అనంతరం చిదంబరంను అరెస్ట్ చేశారు.74 ఏండ్ల ఈ కాంగ్రెస్ నాయకుడిని మొదటగా ఆగస్టు 21వ తేదీన కస్టడీలోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 5 నుంచి జైలులో ఉన్నారు.

Add

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here